: తాజా పరిణామాలపై కేసీఆర్ సమీక్ష
ప్రత్యేక రాష్ట్రం అంశంపై ఈ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు నిశితంగా సమీక్షిస్తున్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో పార్టీ మేధావులు, నేతలతో ఆయన సమావేశమై పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇక, నేతలు మీడియాతో మాట్లాడుతూ, 10 జిల్లాలతో కూడిన తెలంగాణే తమకు ఆమోదయోగ్యమని స్పష్టం చేశారు.