: రెండో ఎస్సార్సీకి ఒప్పుకోం..: సీపీఎం


కాంగ్రెస్ పార్టీ చిన్నరాష్ట్రాల ఏర్పాటు కోసం రెండో ఎస్సార్సీ వేస్తే అంగీకరించబోమని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, సమైక్యాంధ్రకే తమ మద్దతని ఆయన స్పష్టం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల విషయంలో తమ వైఖరిలో మార్పులేదని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణ ఇస్తే చిన్న రాష్ట్రాల డిమాండ్లు పెరుగుతాయని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల పురోగతికి రాజ్యంగబద్దంగా ప్రత్యేకస్థాయి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News