: బాట్లా ఎన్ కౌంటర్ కేసులో షాజాద్ కు జీవితఖైదు


బాట్లా ఎన్ కౌంటర్ కేసులో ఢిల్లీ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. తీవ్రవాది షాజాద్ కు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. 2008లో ఢిల్లీ పేలుళ్లకు పాల్పడిన తీవ్రవాదులు బాట్లా హౌస్ లో ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసు అధికారి శర్మ బాట్లా హౌస్ పై దాడి చేసి నలుగురు తీవ్రవాదుల్ని మట్టు బెట్టారు. మరో ఇద్దరు తప్పించుకున్నారు. కాగా షాజాద్ పట్టుబడ్డాడు. ఈ దాడిలో శర్మకూడా అసువులు బాసారు. ఇప్పటికి షాజాద్ కు శిక్ష పడింది.

  • Loading...

More Telugu News