: సుమోను ఢీ కొట్టిన భువనేశ్వర్-విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్


నిన్నమొన్నటి వరకు ఫ్లాట్ ఫాంల మీదికి దూసుకెళ్లిన రైళ్లు ఇప్పుడు వాహనాలను ఢీ కొంటున్నాయి. నిన్న ట్రాక్టర్ ను ఓ రైలు ఢీ కొంటే, తాజాగా టాటా సుమోను శ్రీకాకుళం జిల్లా గొలన్ త్రాట్ వద్ద భువనేశ్వర్-విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ప్రమాదానికి కారణాలు, గాయపడ్డవారి వివరాలు ఇంకా తెలియరాలేదు. సుమో మాత్రం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం రైలు క్రాసింగుల దగ్గర సిగ్నళ్ళు కానీ, హెచ్చరికలు చేసే గార్డులు కానీ లేకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రైళ్ల రాకపోకలు గమనించని వాహనదారులు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News