: కిషన్ రెడ్డితో కోదండరాం భేటీ
తెలంగాణ అంశం ఆఖరి దశకు చేరుకున్న తరుణంలో భేటీల పర్వం పతాకస్థాయికి చేరింది. ఈ సాయంత్రానికి కేంద్రం తెలంగాణపై స్సష్టమైన ప్రకటన చేస్తుందన్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఈ ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆయన కిషన్ రెడ్డితో చర్చించనున్నారు. కోదండరాంతో పాటు ఇతర సంఘాల నేతలు కూడా కిషన్ రెడ్డితో సమావేశమైన వారిలో ఉన్నారు.