: ఎక్కడ చూసినా పోలీసులే...
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు అందరూ అనుకుంటున్న మాట.. ఎక్కడ చూసినా పోలీసు బలగాలే.. రాష్ట్రాన్ని విభజిస్తున్నారా? ఒకవైపు తుది విడత పంచాయతీ ఎన్నికలు... మరోవైపు తెలంగాణపై కాంగ్రెస్ తుది నిర్ణయం ప్రకటించే వేళ. దీంతో రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సీమాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు. ఇటు తెలంగాణలోనూ ఆందోళనలు. వెరసి రాష్ట్రం మొత్తం పోలీసుల నీడలోకి వెళ్లిపోయింది. 25 కంపెనీల కేంద్ర బలగాలు, 15 కంపెనీల ఇతర రాష్ట్రాల బలగాలు ఇప్పటికే పంచాయతీ ఎన్నికల కోసం వచ్చి ఉన్నాయి. ఇప్పుడు మరో 1000 పోలీసులను రప్పిస్తున్నారు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలలోనూ పోలీసులు మోహరించి ఉన్నారు. అవసరమైతే మరిన్ని బలగాలను పంపించేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధంగా ఉందని సమాచారం. మరోవైపు, పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను మోహరించినట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది.