: చిక్కుల్లో అక్షయ్ కుమార్ దంపతులు
2009లో ముంబయిలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్బంగా అసభ్యంగా ప్రవర్తించిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, అతని భార్య ట్వింకిల్ ఖన్నాలను ప్రాసిక్యూట్ చేయాలని బాంబే హైకోర్టు నేడు పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆ ఫ్యాషన్ షోలో అక్షయ్ ర్యాంప్ వాక్ చేస్తుండగా, భార్య ట్వింకిల్ అతని ప్యాంటు బటన్లను విప్పదీయడం ఈ వివాదానికి కారణమైంది. ఆ ఏడాది మార్చి 29 వకోలా పోలీస్ స్టేషన్లో ఇదే విషయమై ఫిర్యాదు నమోదైంది.