: పేలుళ్లపై లోక్ సభలో చర్చ


హైదరాబాద్ పేలుళ్ల ఘటన అత్యంత విషాదకరమైనదిగా లోక్ సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్ అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కలసికట్టుగా పోరాడాలని కోరారు. వాయిదా అనంతరం సమావేశమైన లోక్ సభలో పేలుళ్లపై స్వల్ప చర్చకు స్పీకర్ మీరా కుమార్ అనుమతించారు. దీంతో బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మ మాట్లాడారు.

ఉగ్రవాదులు దాడులకు పాల్పడతారనే సమాచారం కేంద్రం దగ్గర ఉన్నా వాటిని నిరోధించలేకపోతున్నారని అన్నారు. ఫలితంగా అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడంలో ఉగ్రవాదులు విజయం సాధిస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదానికి మతం రంగు పులమొద్దన్నారు. దేశంతోపాటు రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ఉంటేనే.. ఉగ్రవాదంపై సమర్థవంతంగా పోరాడగలమని చెప్పారు.

అనంతరం సీపీఎం ఎంపీ బసుదేవ ఆచార్య మాట్లాడారు. దాడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఎస్పీ తరఫున ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడుల నిరోధం విషయంలో దేశం మొత్తం ఏకతాటిపై ఉందన్నారు. మరి దాడులను నిరోధించడంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేమిటని ప్రశ్నించారు. 

మరోవైపు వాయిదా అనంతరం 12 గంటలకు రాజ్యసభ సమావేశమైంది. యథావిధిగా పేలుళ్లపై చర్చకు అనుమతించాలని విపక్ష సభ్యులు  పట్టుబట్టారు. దీంతో చేసేదేమీ లేక చైర్మన్ అన్సారీ సభను 2.30 వరకూ వాయిదా వేశారు.. 

  • Loading...

More Telugu News