: సీడబ్ల్యూసీ భేటీ రేపే: మాకెన్
తెలంగాణ అంశంపై ఉత్కంఠకు తెరదించే చర్యలను కాంగ్రెస్ హైకమాండ్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కానుందని పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు, మాజీ మంత్రి అజయ్ మాకెన్ నేడు ఢిల్లీలో తెలిపారు. ఈ భేటీ తర్వాత యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించి చిన్నరాష్ట్రాలపై వాటి అభిప్రాయం తెలుసుకుంటామన్నారు. ఇప్పటికే ములాయంసింగ్ యాదవ్ తాము చిన్నరాష్ట్రాలకు వ్యతిరేకమని తేల్చిచెప్పిన నేపథ్యంలో, రేపటి యూపీఏ పక్షాల భేటీ ఆసక్తికరంగా మారింది.