: ఈసారి మహారాష్ట్ర వంతు.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో కలుషితాహారం తిని 100 మంది వసతి గృహ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీప ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి భోజనం చేసిన తరువాత విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు వసతి గృహ సిబ్బంది చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం బీహార్లో మధ్యాహ్న భోజనం కలుషితమైన ఘటనల్లో పలువురు విద్యార్థులు మరణించగా, మరికొందరు ఆసుపత్రులపాలైన సంగతి తెలిసిందే.