: మేమంతా రాజీనామాలకు సిద్ధం: సాయి ప్రతాప్
రాష్ట్రం విడిపోయే పరిస్థితి లేదని ఎంపీ సాయిప్రతాప్ తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ, తాను సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. సమైక్యాంధ్ర విద్యార్థి నేతలు, ఎన్జీవో నాయకులు ఆయన ఇంటిని ముట్టడించిన సందర్భంగా విభజన జరిగే పరిస్థితే వస్తే... సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఉద్యమకారులకు మద్దతునిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.