: కేసీఆర్ తో జేఏసీ భేటీ
కేసీఆర్ వనవాసం వీడారు. ఇన్నాళ్లూ ఫాంహౌస్ లో ఉండి రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించిన కేసీఆర్ మళ్లీ క్రియాశీలకంగా మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో రాజకీయ జేఏసీ నేతలు కోదండరాం, శ్రీనివాస్ గౌడ్, మరి కొందరితో భేటీ అయ్యారు. యూపీఏ సమన్వయ కమిటీ భేటీ కానున్న నేపథ్యంలో ప్రస్తుత పరిణామాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.