: రాష్ట్రాన్ని ముక్కలు చేశాననే అప్రదిష్ఠ నాకొద్దు: సీఎం
రాష్ట్ర విభజన దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందని సీఎం క్యాంపు కార్యాలయంలో నిన్న కలిసిన మంత్రులతో కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అయితే తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్న అప్రదిష్ఠను మూటగట్టుకోలేనని అధిష్ఠానానికి స్పష్టం చేసినట్టు, అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసేస్తానని, అంతే కానీ రాష్ట్ర విభజనను ఒప్పుకోనని కేంద్రానికి తెలిపానని మంత్రులతో చెప్పినట్టు సమాచారం.