: రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు: పరకాల
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఎక్కవ మంది ప్రజలు కోరుకుంటున్నారని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు పరకాల ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రయత్నాలను అడ్డుకుంటామని అన్నారు. సమైక్యవాదులతో వచ్చే నెలలో విశాలాంధ్ర సభ నిర్వహించనున్నట్టు తెలిపారు.