: 31 న యూపీఏ సమన్వయ కమిటీ భేటీ


తెలంగాణ అంశంపై చర్చించేందుకు యూపీఏ సమన్వయ కమిటీ ఈ నెలాఖరున అంటే 31 న భేటీ కానుంది. తెలంగాణ అంశంపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంతో పాటు, యూపీఏ వైఖరి వెలువరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జరుగనున్న యూపీఏ సమన్వయ కమిటీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భాగస్వామ్యపక్షాల అభిప్రాయం తెలుసుకునే వీలుంటుంది. అదీ కాక పార్లమెంటు బిల్లు పెడితే బిల్లు గెలుస్తుందా? లేదా? అన్న విషయం కూడా స్పష్టమవుతుంది. దీంతో తన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛగా వెలువరించే అవకాశముంది.

  • Loading...

More Telugu News