: కార్పొరేట్ లీడర్లతో రేపు ప్రధాని భేటీ
వృద్ధి రేటు, పారిశ్రామికోత్పత్తి తగ్గుదల.. పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు, రూపాయి విలువ పతనం, తగ్గిన పెట్టుబడులు ఇన్ని సమస్యలు నెలకొన్న తరుణంలో ప్రధాని మన్మోహన్ సింగ్ రేపు కార్పొరేట్ లీడర్లతో సమావేశం అవుతున్నారు. సీఐఐ ప్రెసిడెంట్ క్రిస్ గోపాలకృష్ణన్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చర్, హెడ్ డీఎఫ్ సీ చైర్మన్ దీపక్ పారేఖ్, భారతీ గ్రూపు అధినేత సునీల్ మిట్టల్ తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రధాని సూచనలు కోరనున్నారని సమాచారం. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, నెగటివ్ సెంటిమెంట్ తదితర అంశాలను ప్రధానికి వివరిస్తామని సమావేశంలో పాల్గొనే ఒక పారిశ్రామిక వేత్త ఒక వార్తా సంస్థకు తెలిపారు.