: ఈ మీట నొక్కి క్యాన్సర్‌కు చెక్ చెప్తారు
ఒక్క మీట నొక్కితే చాలు.. క్యాన్సర్ కణాలు ఎదిగి విస్తరించాలో వద్దో డిసైడ్ అవుతుంది. అడ్డుకోవడం అంత సులువా.. ఒక్క మీటలోనే అంతా దాగి ఉందా? అనే సందేహం వస్తోంది కదా! నూరుశాతమూ కాదు గానీ, అలాంటి ఒక మీటను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్యాన్సర్ కణాలు, కణితుల మనుగడకు అవసరమైన ఆక్సిజన్ మామూలు రక్తనాళాల ద్వారా అందని సమయంలోనూ.. తాను యాక్టివేట్ అయి కణాలకు తోడ్పడడంలో హెచ్‌ఐఎప్ 1 అనే మాస్టర్ స్విచ్ పనిచేస్తుంది. దీనివలన అతి తక్కువ ఆక్సిజన్, పోషకాలతోనే క్యాన్సర్ కణాలు విస్తరించగలుగుతాయి. పైగా ఇది క్యాన్సర్ కణాలకు పోషకాలు అందించేలా కొత్త రక్తనాళాలు ఏర్పడేలా చేయగలదు కూడా!
సరిగ్గా ఈ 'మాస్టర్ స్విచ్' ను పనిచేయకుండా చేస్తే క్యాన్సర్ విస్తరణను ఆపవచ్చునని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని వారు సింథటిక్ బయాలజీగా అభివర్ణిస్తున్నారు. అయితే క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇది అందుబాటులోకి రావడానికి ఇంకా అనేక దశల పరిశోధనలు సాగాల్సి ఉంది.