: త్వరలో రెహమాన్ 'ఇండియా రోడ్ టూర్'
స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ త్వరలో 'ఇండియా రోడ్ టూర్' నిర్వహించబోతున్నాడు. 'రెహమాన్ ఇష్క్' పేరుతో నిర్వహించబోతున్న ఈ పర్యటన దేశంలోని పలు నగరాల మీదుగా సాగనుంది. తన సంగీతంలో విజయం సాధించిన 'రోజా', 'జోథా అక్భర్', 'స్లమ్ డాగ్ మిలియనీర్', 'జబ్ తక్ హై జాన్', 'రాన్ జానా' వంటి చిత్రాల్లోని పాటలను ఈ టూర్ లైవ్ కచేరీల్లో పలువురు గాయకులు పాడనున్నారు. తన సంగీత ప్రస్థానంలోని వివిధ అనుభవాలను కూడా రెహమాన్ పంచుకోనున్నాడు. దీని ద్వారా స్నేహం, శాంతి, సంతోషాల సందేశాన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడమే లక్ష్యం. అంతకంటే ముందు సిడ్నీలో ఆగస్టు 24న రెహమాన్ కచేరీ నిర్వహించన్నాడు. గతంలో దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఇలానే సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు.