: తెలంగాణ వస్తున్న వేళ అడ్డుపుల్లలం కాబోము: కొండా సురేఖ
తెలంగాణ వస్తుందనుకుంటున్న తరుణంలో తాము అడ్డుపుల్లలు కాదల్చుకోలేదని వైఎస్సార్సీపీ నేత కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో పార్టీ నేతలు చేసిన రాజీనామాల వల్ల తమ ప్రాంతంలో నిరసనలు ఎదుర్కోవలసి వస్తుందని పార్టీకి చెప్పామన్నారు. అయితే, రాజీనామాలు చేసిన వారు వ్యక్తిగతంగా చేశారా? లేక పార్టీపరంగా చేశారా? అన్న దానిపై పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టత ఇవ్వలేదని అన్నారు. పార్టీలో రాజీనామాలపై తెలంగాణ ప్రాంత నేతలు విజయమ్మతో భేటీ అయ్యారు. అనంతరం సురేఖ మీడియాతో మాట్టాడుతూ.. విజయమ్మతో భేటీలో తామంతా అసంతృప్తితో బయటకు వచ్చామన్నారు. తెలంగాణ అంశంపై పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, పార్టీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నామని సురేఖ అన్నారు. తదుపరి కార్యాచచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు.