: ఆహార భద్రతా బిల్లుకు మాయావతి మద్ధతు


కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఆహార భద్రతా బిల్లుకు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మద్దతు తెలిపారు. సిద్ధాంతాల పరంగా బిల్లుకు తాము వ్యతిరేకం కాదన్నారు. సబ్సిడీ విధానంలో ప్రజలకు ఆహారం అందాలన్నదే తమ కోరిక అని, అడ్డుచెప్పబోమన్నారు. అయితే, బిల్లును చట్ట రూపంలో తెచ్చేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలే సరిగాలేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగిన తర్వాత తీసుకొస్తే మంచిదని ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాయావతి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News