: ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పోలింగ్


చిన్న చిన్న ఘర్షణలు మినహా రాష్ట్రంలోని 6,971 పంచాయతీల్లో రెండో దశ పోలింగు ప్రశాంతంగా ముగిసింది. భారీగా స్పందించిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒంటిగంట సమయానికి క్యూలో ఉన్నవారికే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ముందు వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి తర్వాత సర్పంచ్ ల ఓట్లు లెక్కిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రంకల్లా ఫలితాలు వెల్లడవనున్నాయి.

  • Loading...

More Telugu News