: సరైన డ్రెస్ వేసుకోండి.. విద్యార్థినులకు ఏఎంయూ సూచన
యూనివర్సిటీ ఫంక్షన్ల సమయంలో సల్వార్ కమీజ్, దుపట్టానే వేసుకోవాలంటూ విద్యార్థినులను ఆదేశించిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ).. నిరసనలతో వెనక్కి తగ్గింది. తన ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ.. హుందాగా కనిపించే డ్రెస్సులనే ధరించాలని కోరింది. యూనివర్సిటీలోని మహిళా కాలేజీ విద్యార్థినులకు ఏఎంయూ ఈ సూచనలు చేసింది.