: మంచు కరిగి సరస్సులా మారుతున్న ఉత్తర ధృవం
ఉత్తర ధృవం అంటే.. అది కేవలం మంచు కొండలా మాత్రమే ఉంటుందని మనకు తెలుసు. కానీ గ్లోబల్ వార్మింగ్‌కు సంబంధించిన ప్రమాదకరమైన సంకేతాలు ఇప్పుడు ఎలా ధ్వనిస్తున్నాయంటే.. ఉత్తరధృవం వ్యాప్తంగా ఉండవలసిన మంచు గడ్డలు కరిగి అదే ప్రాంతంలో సరస్సుల్లాగా దర్శనమిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వలన పొంచి ఉన్న ప్రమాదానికి ఇది సంకేతం అని.. ఇది యావత్ ప్రపంచానికి హెచ్చరిక అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అయితే, ప్రస్తుతానికి ఉత్తర ధృవం సర్వం ఇలా కరిగిపోలేదు. ఈ సరస్సుల్లోనూ, వాటి దిగువన ఉన్న ఆర్కిటిక్ సముద్రంలోనూ మంచు గడ్డలు అలాగే ఉన్నాయి. అయితే ప్రమాదం మాత్రం పొంచి ఉన్నదని అంటున్నారు. ఈ మేరకు నార్త్ పోల్ ఎన్విరాన్‌మెంటల్ అబ్జర్వేటరీ వారు కొన్ని ఫోటోలను విడుదల చేశారు. 2000 సంవత్సరంనుంచి ఉత్తర ధృవాన్ని పరిశీలిస్తున్న వారు.. అక్కడ వాతావరణంలో వేడి 1నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని కూడా ప్రకటించారు.