: ఆకట్టుకుంటున్న జింబాబ్వే 122/3
జింబాబ్వే నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. 295 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వేకు సిబంద, సికందర్ రాజా చక్కని ఆరంభం ఇచ్చారు. సిబంద అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం వచ్చిన మసకద్జ(30 బ్యాటింగ్) కూడా చక్కగా ఆడుతూ వికెట్ కాపాడుకున్నాడు. టేలర్ రనౌట్ కావడంతో 25 ఓవర్లలో జింబాబ్వే 3 వికెట్లను కోల్పోయి 122 పరుగులు చేసింది. సరిగ్గా ఈ దశలో టీమిండియా 109పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. యువకెరటం ఉనద్కత్ చక్కని బంతులతో ఆకట్టుకుని రెండు వికెట్లు తీశాడు.