: ఇక తెలంగాణపై నిర్ణయమే.. సంప్రదింపుల్లేవ్: దిగ్విజయ్
తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఇక ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని వెల్లడించారు. ఢిల్లీలో ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణపై అంతిమ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. కాగా, సాయంత్రం 5.30 గంటలకు కోర్ కమిటీ భేటీ జరగనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలందరూ హస్తినలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే.