: ఆరోపణలపై స్పందించిన మాజీ సీజేఐ అల్తమాస్ కబీర్


కొన్ని వర్గాలు తనను లక్ష్యంగా చేసుకున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే పదవీ విరమణ చేసిన అల్తమాస్ కబీర్ అన్నారు. సుప్రీంకోర్టులో అవినీతి ఉందని తాననుకోవడం లేదని చెప్పారు. న్యాయవ్యవస్థలో అవినీతిని పెద్దది చేసి చూపుతున్నారని అన్నారు. తనకు కొంత మంది శత్రువులు ఉన్నారని, వారిలో ప్రశాంత్ భూషణ్ కూడా ఒకరని అన్నారు. కబీర్ పదవి నుంచి దిగిపోయే చివరి రోజుల్లో నీట్ పరీక్ష రద్దు సహా పలు తీర్పులను కొందరికి అనుకూలంగా జారీ చేశారని, వీటిపై విచారణ జరిపించాలంటూ డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. మాజీ న్యాయమూర్తులు కూడా సదరు తీర్పులపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు వాటిని సావధానంగా విన్న కబీర్ ఇప్పుడు వాటిపై నోరు మెదిపారు.

టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం 'ప్రేరేపితమైనది' అని చెప్పారు. 'నా ఆధ్వర్యంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పులపై ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ నిందారోపణలు చేయడం సరికాదు' అని అన్నారు. నీట్ పరీక్షపై తీర్పు లీకవుతుందని తనకు తెలియదని కబీర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News