: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సాంకేతిక శాఖ బంపరాఫర్
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. వీరికి ఆపిల్ ఐఫోన్-5 ను అందజేసేందుకు ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ శాఖ ఆదేశాల ప్రకారం ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి 40 వేలకు పైగా విలువ చేసే ఐఫోన్ 5 ను అందజేయనున్నారు. అందుకు 395 ఫోన్లను కొనుగోలు చేసేందుకు 2 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రణాళికేతర వ్యయం కింద నిధులను విడుదల చేసింది. కాగా ఫోన్లు కొనగా మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమచేయాలని పేర్కొంది.