: పాలిస్తే తల్లులకూ మేలే!


పిల్లలకు పాలివ్వడం వల్ల తల్లులకు కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు తాజాగా కనుగొన్నది కాదు కానీ, కొత్తగా కనుగొన్న విషయం ఏమంటే పిల్లలకు పాలివ్వడం వల్ల తల్లులను కుంగుబాటు నుండి దూరం చేస్తుందని చెబుతున్నారు. కాన్పు అయిన తొలినాళ్లలో పిల్లలకు పాలిచ్చే తల్లులు తర్వాత కాలంలో కుంగుబాటు బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జాక్సన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక అధ్యయనంలో తల్లులు తమ పిల్లలకు పాలివ్వడం వల్ల కుంగుబాటు ప్రభావం నుండి బయటపడవచ్చని గుర్తించారు. పిల్లల ఎదుగుదలకు విటమిన్‌ ఎ చాలా అవసరం. ఈ విటమిన్‌ బాలింతల్లో అధిక మోతాదులో నిల్వ ఉంటుంది. ఒకవేళ పిల్లలకు పాలివ్వని పక్షంలో బాలింతల్లో విటమిన్‌ ఎ పేరుకుపోతుందని, ఫలితంగా తల్లులు కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. తల్లుల పాలనుండే పిల్లలకు విటమిన్‌ ఎ అందుతుందని, కాన్పు తర్వాత తొలినాళ్లలో తల్లులు తమ పిల్లలకు పోతపాలు పడితే దీనిఫలితంగా అటు తల్లులో విటమిన్‌ ఎ పేరుకుపోయి కుంగుబాటుకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సుమారు 80 శాతం మంది బాలింతలు స్వల్పంగా కుంగుబాటు బారినపడే అవకాశం ఉంది. దీనికి హార్మోన్ల మార్పులు దోహదం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే కుటుంబంలో ఎవరైనా కుంగుబాటు బారినపడడం, వేధింపులు లేదా మానసిక అస్వస్థత, పొగతాగడం, మద్యం అలవాటు వంటివి కూడా కుంగుబాటుకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News