: ఓట్లేయలేదని మంచినీరు ఆపేసిన కాంగ్రెస్ నేతలు
పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓట్లేయలేదని మంచినీరు ప్రజలకు అందకుండా ఆపేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పొన్నూరు మండలం ముడుకుదురు గ్రామంలో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్ధికి ఓట్లేయలేదని గ్రామానికి మంచినీటి సరఫరా ఆపేశారు. గ్రామంలోని టీడీపీ నేతల ఫిర్యాదుతో ఏఈ మరియదాసు గ్రామానికి వెళ్లి మంచినీరు సరఫరా చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.