: మధ్యాహ్న భోజన పర్యవేక్షణ బాధ్యత టీచర్లది కాదు: పాట్నా హైకోర్టు
బీహార్లో మధ్యాహ్న భోజన వివాదం ముగిసింది. దీనిపై ఈ మధ్యాహ్నం హైకోర్టు తీర్పునిచ్చింది. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే టీచర్ల పని తప్ప, వారి భోజన సదుపాయాలు పర్యవేక్షించడం కాదని స్పష్టం చేసింది. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతలను ఎన్జీవోలకు అప్పగించాలని కోర్టు సూచించింది. పాట్నా హైకోర్టు తీర్పుపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.