: లతా మంగేష్కర్ కు 'యశ్ చోప్రా' అవార్డు


ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కు దివంగత బాలీవుడ్ దర్శకుడు 'యశ్ చోప్రా మెమెరియల్ అవార్డు' లభించింది. 'విజయ్', 'చాందినీ', 'లమ్హే' వంటి పలు హిందీ చిత్రాలను నిర్మించిన ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి యశ్ చోప్రా పేరిట ఈ అవార్డును ప్రకటించారు. సుబ్బిరామిరెడ్డికి చెందిన టీఎస్ఆర్ సంస్థ ఈ అవార్డును స్థాపించింది. ప్రతి సంవత్సరం సినిమా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులకు అవార్డును ఇవ్వనుంది.

ఈ అవార్డును తొలిసారిగా గాయకురాలు లతా మంగేష్కర్ కు ఇస్తున్నట్లు సుబ్బిరామిరెడ్డి చెప్పారు. సినిమా రంగానికి తన పాటల ద్వారా ఎనలేని సేవలు చేసిన లతా మంగేష్కర్ కు యశ్ చోప్రాతో మంచి సాన్నిహిత్యం ఉందని.. ఆయన ప్రతి చిత్రంలో ఆమె పాడారని పేర్కొన్నారు. అందుకే చోప్రా మరణించిన అక్టోబర్ 12వ తేదీన ప్రతి సంవత్సరం ఈ అవార్డును బహుకరించనున్నట్లు వెల్లడించారు. కాగా, అవార్డుకు జ్యూరీ మెంబర్లుగా హిందీ చిత్ర రంగానికి చెందిన హేమా మాలిని, సిమి గరేవాల్, అనిల్ కపూర్ వ్యవహరించారు.

  • Loading...

More Telugu News