: 'వికీలీక్స్' రాజకీయ పార్టీని స్థాపించిన అసాంజే
'వికీలీక్స్' వ్యస్థాపకుడు జులియన్ అసాంజే రాజకీయ పార్టీని స్థాపించాడు. నేడు లండన్ లో స్కైపీ లింక్ ద్వారా ఈ పార్టీని ప్రారంభించాడు. లండన్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలోనే అసాంజే ఒక సంవత్సరం నుంచి ఉంటున్నాడు. అసాంజే త్వరలోనే ఆస్ట్రేలియాలోని విక్టోరియా నుంచి సెనేట్ కు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై వికీలీక్స్ పార్టీ అధికార ప్రతినిధి సమంతా క్రాస్ మాట్లాడుతూ.. పార్టీలో నిజాయతీ, పారదర్శకత కలిగిన అభ్యర్ధులనే తీసుకుంటామన్నారు. అంతేగాక అసాంజే తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు.
పార్టీలో చేరే అభ్యర్ధి పారదర్శకత కలిగి, విద్య, సామాజిక న్యాయం, చట్టపరమైన విషయాలు, ఇంకా జర్నలిస్ట్ నేపథ్యం కలిగి, నైపుణ్యం ఉన్న వారినే తీసుకుంటామని వెల్లడించారు. అగ్రరాజ్యం అమెరికా, భారతదేశానికి సంబంధించిన పలు రహస్య సమాచారాలను వికీలీక్స్ సంస్థ ద్వారా బయటపెట్టి అసాంజే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.