: ఆర్ బీఐ చైర్మన్ గా దువ్వూరి విఫలం: పనగారియా


దువ్వూరి సుబ్బారావు హయాంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనితీరు చరిత్రలో ఎన్నడూలేనంత దారుణంగా తయారైందని ప్రఖ్యాత ఆర్ధికవేత్త, కొలంబియా వర్శిటీ ఎకనామిక్ ప్రొఫెసర్ అరవింద్ పనగారియా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సుబ్బారావు పర్యవేక్షిస్తున్న ద్రవ్యవిధానం లోపభూయిష్టమని ఆయన పేర్కొన్నారు. ఎన్డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్ధికరంగంపై తన అభిప్రాయాలను కుండబద్ధలుకొట్టారు. ఆర్ బీఐ గవర్నర్ గా దువ్వూరి తీరు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని వ్యాఖ్యానించారు.

2009-10లో రూపాయి క్రియాశీలకంగా ఉన్న సమయంలో డాలర్ నిల్వలు పెంపొందించుకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఘోర తప్పిదానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. తత్ఫలితంగానే నేడు డాలర్ తో రూపాయి పోరాటం సాగిస్తోందని పనగారియా విపులీకరించారు. పలు ఆర్ధిక విధానాల పట్ల దువ్వూరి ప్రణాళికలు సవ్యంగానే ఉన్నా, వాటిని అమలు చేస్తున్న తీరే అనర్థదాయకంగా ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News