: వ్యక్తిగత హాజరుకు మినహాయింపివ్వండి: అనిల్ అంబానీ
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని రిలయన్స్ ఎడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ముందుగా ఖరారయిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున వ్యక్తిగతంగా హాజరుకాలేనని, ఆగస్టు 15 తరువాత ఏరోజైనా కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని అనిల్ ఢిల్లీ కోర్టుకు తెలిపారు. 2జీ స్పెక్ట్రం కేసులో ప్రాసిక్యూషన్ తరపు సాక్షిగా హాజరు కావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు అనిల్ కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.