: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై కేసు
ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణలతో నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై కట్టంగూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం సభలు, సమావేశాలకు అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే, ఎమ్మెల్యే ఎలాంటి అనుమతులు లేకుండా కట్టంగూరు మండలంలోని కల్మెర, పరడ గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారని, అందుకే ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.