: తెల్లరక్తకణాలు ఇలా పోరాడతాయి


మన శరీరంలో ఉండే తెల్లరక్తకణాలు శరీరానికి ఏదైనా వ్యాధి సోకినపుడు సదరు వ్యాధి కారక క్రిములతో పోరాడతాయి. అయితే ఈ పోరాటం గురించి మనకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఈ పోరాటానికి సంబంధించి ఎంచక్కా మనశాస్త్రవేత్తలు ఫోటోలను తీసి చూపిస్తున్నారు. ఈ ఫోటోల్లో తెల్లరక్త కణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా తెల్లరక్త కణాలను స్పష్టంగా ఫోటోలను తీయడం అనేది ఇదే తొలిసారిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెల్ల రక్తకణాలు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై, కణితులపై ఎలా దాడి చేస్తాయి? అనే విషయాన్ని స్పష్టంగా తెలిపే కొత్త ఫోటోలను తీశారు. వైరస్‌లలో లేదా కణితులకు ప్రేరేపితమైనపుడు తెల్ల రక్తకణాలు తమ ఉపరితలం మీదుండే ప్రోటీన్ల వ్యవస్థను మార్చుకుంటున్న తీరును వీరు ఫోటోల్లో బంధించారు. ఈ ఫోటోలు జబ్బులను ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక విషయాలను అందించగలవని ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్‌ డేనియల్‌ డేవిస్‌ చెబుతున్నారు. వైరస్‌తో పోరాడే సమయంలో తెల్లరక్తకణాల ఉపరితలం మీది ప్రోటీన్లు గుంపుగా జట్టుకడుతున్నాయని, రోగ నిరోధక కణాలు పనిచేసే విధానాన్ని ఇలా అత్యంత స్పష్టంగా (హై రిజల్యూషన్‌) చూడడం ఇదే తొలిసారి అని డేవిస్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News