: చెరువులో 400 మద్యం బాటిళ్లు స్వాధీనం
పంచాయతీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సరఫరా చేస్తున్న 400 మద్యం సీసాలను ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం సమీపంలో స్థానికులు పట్టుకున్నారు. ఈ సీసాలను ఆటోలో రామకృష్ణాపురం గ్రామానికి తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, 10 కేసుల మద్యం సీసాలను ఆటోడ్రైవర్ ప్రక్కనే ఉన్న చెరువులో పడేసి పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మద్యం సీసాలు చెరువులోంచి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతామని చింతకాని ఎస్సై తెలిపారు.