: సల్మాన్ ఖాన్ పై అభియోగాలు నమోదు
కారుతో ఢీకొట్టి ఒకరి మరణానికి కారణమైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై ఆ కేసులో నేడు అభియోగాలు నమోదయ్యాయి. అయితే, తాజా విచారణను వాయిదా వేస్తున్నట్టు ముంబయిలోని సెషన్స్ కోర్టు పేర్కొంది. కేసును మరో న్యాయస్థానానికి బదలాయిస్తున్నట్టు తెలిపింది. కాగా, నేటి విచారణలో భాగంగా సల్మాన్ శిక్షించదగిన హత్యానేరానికి పాల్పడ్డట్టు అభియోగాలు నమోదు చేశారు. నేరం నిరూపితమైతే సల్మాన్ కు 10 ఏళ్ళ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ ఖాన్, ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో, తన కారును ఫుట్ పాత్ పైకి నడపడంతో అక్కడ నిద్రిస్తున్న వారిలో ఓ వ్యక్తి మరణించగా, నలుగురికి గాయాలయ్యాయి.