: 'వాల్ మార్ట్' పోతే ఇంకొకరు వస్తారు: కాంగ్రెస్


ఎవరో ఒకరి కోసం చిల్లర వర్తకం(రిటైల్)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన(ఎఫ్ డీఐ) పాలసీని మార్చబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. 'వాల్ మార్ట్' పోతే పోనీ, భారత్ కు రావడానికి మరిన్ని రిటైల్ సంస్థలు రెడీగా ఉన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్ బబ్బర్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం కేవలం ఒక వ్యాపార సంస్థ కోసం ఎఫ్ డీఐ పాలసీని తీసుకురాలేదని స్పష్టం చేశారు. ఇది జాతీయ విధానం అని, జాతి ప్రయోజనాల కోసం ఉద్దేశించినదని బబ్బర్ అన్నారు.

ఎఫ్ డీఐ పాలసీలో నిబంధనల పట్ల 'వాల్ మార్ట్' ప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 శాతం వస్తువులను స్థానికంగా చిన్న, మధ్య స్థాయి సంస్థల నుంచే కొనుగోలు చేయాలంటూ మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్ డీఐలో ప్రభుత్వం ఒక నిబంధన విధించింది. దీనిపై వాల్ మార్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని 20 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేసింది. వాల్ మార్ట్ ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం మార్పులు చేయడానికి సిద్ధమైందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని బబ్బర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News