: కాబట్టే మనం కొత్త పదాలు నేర్చుకుంటాం


భూమిపై ఉన్న అన్ని జీవజాతుల్లోకి మనిషి కాస్త ఎక్కువ. ఎందుకంటే మనిషికి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకునే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది. మనుషులు మేధోపరంగా ఉన్నతస్థానంలో ఉంటారని, కొత్త భాషలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారని శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది.

కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌, బార్సిలోనా విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లో మనుషులు మాత్రమే ఇలా కొత్త పదాలను నేర్చుకోవడం వెనుకున్న రహస్యాన్ని చేదించారు. నిజానికి మనుషులకు దగ్గరి సంబంధం ఉన్న చింపాజీలతో పోల్చుకుంటే మనుషులు అధిక భాషలను నేర్చుకుంటారు. చింపాంజీలు ఓ వంద పదాలకు మించి నేర్చుకోలేవు. అయితే ఒక సగటు మనిషి దాదాపు 30 వేల పదాలను నేర్చుకుంటాడు. కొత్త పదాలను నేర్చుకోవడమే కాకుండా తాను నేర్చుకున్న పదాలను వాడుకలో పెట్టడం వంటి ప్రక్రియ ద్వారా కొత్త భాషలను మనిషి నేర్చుకోగలుగుతున్నాడని ఇప్పటి వరకూ జరిగిన విశ్లేషణలో తేలింది. అయితే ఇలా మనిషి మాత్రమే కొత్త భాషలను నేర్చుకోవడం వెనుకున్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు.

తాజాగా జరిపిన ఈ అధ్యయనంలో మనిషి మెదడులోని ఫాసిక్యులస్‌ అనే నాడీ తంతువులు టెంపోరల్‌ లోబ్‌లోని వినికిడి ప్రాంతాలను, ఫ్రంటల్‌ లోబ్‌లో ఉండే మోటార్‌ ఏరియాతో కలుపుతున్నాయని, దీనివల్లే పదాల ఉచ్ఛారణతో సంబంధం ఉండే మెదడు ప్రాంతంలో కొత్త పదం తాలూకు శబ్దం అనుసంధానమవుతుందని తేలింది. ఇందుకోసం వీరు ఆరోగ్యంగా ఉండే 27 మంది వ్యక్తులను తీసుకుని, వారు కొత్త పదాలను నేర్చుకొనే సమయంలో వారి మెదడులో జరిగే మార్పులను పరిశీలించారు. ఇలా మెదడులో వినికిడి`మోటార్‌ సంబంధాలు ఎంతగా అభివృద్ధి చెందాయి అన్నదాన్ని బట్టే మనలో కొత్త పదాలను నేర్చుకునే సామర్ధ్యం ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News