: ముస్లిం మహిళల అందాలకు అడ్డొచ్చిన ఫత్వా


ఫత్వాలకు ఇంత పవర్ కూడా ఉంటుందా? అనిపించేలా మలేషియాలో ఒక ఘటన జరిగింది. మిస్ మలేషియా వరల్డ్ 2013 పోటీల ఫైనలిస్టుల జాబితా నుంచి నలుగురు ముస్లిం అందాల భామలను నిర్వాహకులు తప్పించారు. ముస్లిం మహిళలు అందాల పోటీలలో పాల్గొనడం పాపమంటూ ఫెడరల్ టెరిటరీ నేత ముఫ్తి దాతక్ వాన్ జాహిది వాన్ హెచ్చరికలు జారీ చేయడంతో నిర్వాహకులు ఈ చర్య తీసుకున్నారు. దీంతో సారా అమెలియా బెర్నార్డ్, వాహా జోహన్న డీ కోర్టే, మీరాషేక్, కత్రినా రిడ్జువాన్ అందాల కిరీటాన్ని దక్కించుకునే అవకాశం కోల్పోయారు. ఈ యువతులు ముస్లిం చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ వాన్ జాహిది ఆన్ లైన్లో వ్యాఖ్యానించడంతోనే వారిని పోటీ నుంచి తప్పించినట్లు మిస్ మలేషియా వరల్డ్ నిర్వాహకుడు దాతుక్ అన్నాలిమ్ తెలిపారు.

  • Loading...

More Telugu News