: బలహీన జట్టుతో టీమిండియా వన్డే సిరీస్ రేపటి నుంచి
యువశక్తి పరవళ్ళెత్తుతున్న టీమిండియా రేపు తన జింబాబ్వే పర్యటనను ఆరంభించనుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ హరారేలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 12.30కు మొదలవుతుంది. కాగా, భారత్-జింబాబ్వే జట్ల మధ్య ఇప్పటివరకు 51 వన్డేలు జరగ్గా.. భారత్ 39 మ్యాచ్ లలో జయభేరి మోగించి స్పష్టమైన ఆధిక్యం నమోదు చేసింది. ఇక బలహీన జింబాబ్వే 10 పోటీల్లో నెగ్గగా 2 వన్డేలు టైగా ముగిశాయి. చివరిసారి రెండు జట్ల మధ్య హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలోనే మ్యాచ్ జరగడం విశేషం. ఈ పోరులో జింబాబ్వే 7 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేసింది.