: ఓటు హక్కు వినియోగించుకున్న మోహన్ బాబు, విష్ణు
తొలి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం రంగంపేట పోలింగు కేంద్రంలో ఇద్దరూ ఓటు వేశారు. అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని, దానిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.