: ప్రముఖ నటి మంజుల కన్నుమూత
ప్రముఖ నటి మంజుల (60) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆమె ఈ మధ్యాహ్నం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. దక్షిణాది భాషల్లో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించిన మంజుల.. తెలుగు, తమిళంలో దాదాపు అగ్రహీరోలందరితోనూ నటించారు. 1969లో శాంతినిలయం చిత్రం ద్వారా ఆమె చిత్రం రంగంలో ప్రవేశించారు. తమిళనటుడు విజయ్ కుమార్ ను వివాహం చేసుకున్న మంజుల అడపాదడపా తెలుగు చిత్రాల్లో కనిపించారు. మంజుల కుమార్తెలయిన వనిత, శ్రేదేవి, ప్రీతి.. ముగ్గురూ హీరోయిన్లుగా పలు చిత్రాల్లో నటించారు.