: భారీ నుంచి అతిభారీ వర్షాలు: వాతావరణ శాఖ


రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు, ఒడిసా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ వ్యాపించిన ఉపరితల అల్పపీడన ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. దీనివల్ల తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కోస్తాంధ్ర తీరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

  • Loading...

More Telugu News