: జగన్ కేసులో ఐఏఎస్ ల విచారణపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు ఆదేశం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో.. ఐఏఎస్ ల విచారణకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లోగా నిర్ణయం తెలపాలని స్పష్టం చేసింది. ఇప్పటికే జగన్, ఎమ్మార్ కేసుల్లో.. శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య, మన్మోహన్ సింగ్, శామ్యూల్స్, సుబ్రమణ్యం, వెంకటరామిరెడ్డిలను విచారించేందుకే ప్రభుత్వం అనుమతించింది. దాంతో మిగతా వారిని కూడా ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని కుటుంబరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తాజా ఆదేశాలు జారీ చేసింది.