: మోడీ సభకు టిక్కెట్ కౌంటర్ తెరిచిన బీజేపీ
హైదరాబాదులో జరగనున్న గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ బహిరంగ సభ నిమిత్తం రాష్ట్ర బీజేపీ టిక్కెట్ కౌంటర్ తెరిచింది. ఆగస్టు 11న నగరంలో జరగనున్న మోడీ సభలో పాల్గొనాలంటే సభ్యత్వ నమోదు చేయించుకోవాలని, అందుకు ఐదు రూపాయల టిక్కెట్ తప్పనిసరని కొన్ని రోజుల కిందట ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు ఈ రోజు హైదరాబాదులో టిక్కెట్ల అమ్మకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే గతవారమే ఆన్ లైన్ రిజర్వేషన్ కూడా మొదలైంది. దీని ద్వారా వచ్చిన నిధులను ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఇవ్వనున్నట్లు బీజేపీ వెల్లడించింది.