: ఆసుపత్రిలో చేరిన ప్రిన్స్ విలియమ్ భార్య
గర్భవతి అయిన బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య కేట్ మిడిల్ టన్ డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరింది. వెస్ట్ లండన్ లోని పాడింగ్ టన్ లో ఉన్న సెయింట్ మేరిస్ ప్రయివేటు ఆసుపత్రిలో ఆమెను చేర్చించారు. విశేషమేమిటంటే, 1982లో ఇదే ఆసుపత్రిలో విలియమ్ జన్మించాడు. మరికొన్ని గంటల్లో కేట్.. బ్రిటన్ వారసుడు లేదా వారసురాలికి జన్మనివ్వబోతోంది. దాంతో, బ్రిటన్ ప్రజలు ఆ సమయంకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.