: ఆంధ్రప్రదేశ్ ను ముంచెత్తనున్న చైనా పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ ను చైనా పెట్టుబడులు ముంచెత్తనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రంగాల్లో చైనా 160 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు భారత్ లో పలు రూపాల్లో చైనా పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత్ రక్షణ మంత్రి తాజా చైనా పర్యటన సందర్భంగా జరిపిన చర్చల్లో ఈ మేరకు మంత్రుల హోదాలో కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీని ప్రకారం చైనా తన పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ ను ఎంచుకుంది. ఇందుకు సంబంధించిన చర్చలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చైనా ప్రధాని ఆర్ధిక సలహాదారు షూసన్ జరిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, చిన్న తరహా పరిశ్రమలు, విద్య తదితర రంగాల్లో చైనా పెట్టుబడులు పెట్టనున్నట్టు సమాచారం. కాగా, చైనా విద్యార్థులు పది వేల మంది విద్యాభ్యాసానికి హైదరాబాద్ వస్తారని షూసన్ తెలిపారు.