: రాకుమారుడి స్వాగతానికి ముస్తాబవుతున్న లండన్


రాజకుమారుడి తొలి అడుగు కోసం లండన్ నగరం ముస్తాబవుతోంది. ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ ల తొలి సంతానానికి స్వాగతం పలికే శుభఘఢియ కోసం లండన్ నగరం సిద్ధమవుతోంది. శుభవార్త వెలువడగానే లండన్ టవర్ నుంచి 62 గన్ లతో శాల్యూట్ చేయనున్నారు. ధేమ్స్ నది పొడుగునా దీపప్రదర్శన ఏర్పాటు కానుంది. ప్రఖ్యాత లండన్ ఐ కూడా ఎరుపు, తెలుపు, నీలి రంగు కాంతులతో తళుకులీననుంది. ఇప్పటి వరకు బ్రిటిష్ రాజవంశపు చిన్నారులు ధరించిన దుస్తులతో ఇప్పటికే లండన్ మ్యూజియంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే, ఆ తొలి క్షణం కోసం నగరం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

  • Loading...

More Telugu News